విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

కరీంనగర్ హెల్త్ : చికిత్స కోసం అర్బన్ హెల్త్ సెం టర్లకు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసి మందులు అందజేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మో తాజీఖానా, బీఆర్‌ఆర్ కాలనీ, విద్యానగర్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సక్రమంగా సేవలం దించడం లేదని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. విద్యానగర్ సెంటర్‌లో ప్రతినెలా 9న నిర్వహించే గర్భిణుల పరీక్షల వివరా లను ఎందుకు నమోదు చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చే మ హిళలకు పరీక్షలు చేసి హిమోగ్లోబిన్ తగ్గినట్లయితే వారికి మందులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి రోగి రికార్డులను ని ర్వహించాలని ఆదేశించారు. మందులు లేకుంటే ఇండెంట్ పెట్టుకోవాలన్నారు. సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్య సేవలందించడంతోపాటు సమయపాలన పాటించాలనీ, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బందికి నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందనున్న నేపథ్యంలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. త్వరలో బస్తీ దవాఖానాలు.. కరీంనగర్‌లో బస్తీ దవాఖానాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని రాంమనోహర్‌రావు తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లుండగా ఇందు లో ఉదయం 9గం టల నుంచి 4 వరకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండగా మరో నాలుగు గం టలు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4.30 నుంచి 8.30 వరకు ప్రభు త్వం ప్రత్యేక వైద్యులను నిర్వహించి ఒక్కో వైద్యుడికి రోజుకు రూ. 2500 గౌరవ వే తనం ఇస్తుందని రోజుకు 30 మంది రోగులకు మించితే ప్రతి రోగిపై రూ. 50 అదనంగా ఇస్తుందని తెలిపారు. ఇందులో పిడియాట్రీషియన్, గైనకాలజిస్ట్, ఫీజిషియన్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
More