రక్షణ చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ క్రైం : హైకోర్టు సూచనల మేరకు పాఠశాలల యజమాన్యాలు విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని సీపీ కమలాసన్‌రెడ్డి సూ చించారు. రక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కమిషనరేట్ కేంద్రంలో పాఠశాలల యజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఊహించని సంఘటనలు జరిగితే పాఠశాలపై చెడు ప్రభావం పడుతుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బా లలు, విద్యారినుల రక్షణ కో సం సుప్రీంకోర్టు చేసిన సూచనలను పాటించాలని సూచించారు. పాఠశాలల్లో విధిగా సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేసుకుని ప్రతి ఆవరణ నిక్షిప్తమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. యుక్త వయస్సులో విద్యార్థులు వివిధరకాల ఆకర్షణలకు లోనయ్యే ప్రమాదం ఉందని, అలాంటి వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి వందమంది జమకూడే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చట్టం నిర్ధేశిస్తుందన్నారు. సుప్రీం కోర్టు సూచనలు పాటించి కరీంనగర్‌లోని పాఠశాలలు దేశానికి ఆదర్శంగా మారాలన్నారు. ఈనెల 31 లోగా పాఠశాలల్లో కెమెరాలు ఏర్పాటు తో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
More