పాఠశాలలకు ఉపాధ్యాయుల సర్దుబాటు

ముకరంపుర : కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను ఎంఈవోలు వెంటనే పాఠశాలల నుంచి విడుదల చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు మిగులుగా ఉన్న పాఠశాలల నుంచి, విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు ప్రక్రియ ప్రతియేడాది జరుగుతుంది. ఈ యేడాది కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 114 మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. వీరితో పాటు ఇప్పటికే విద్యావాలంటీర్లు విధుల్లో చేరారు. నేడో, రేపో టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఈ మూడు ప్రక్రియలతో జిల్లాలో వివిధ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు, ఉపాధ్యాయుల కొరత తీరి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నది. ఈ నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈవోకు కృతజ్ఞతలు తెలిపాయి.

Related Stories: