క‌రీనా బ‌ర్త్‌డే వేడుక‌లో క‌పూర్ ఫ్యామిలీ సంద‌డి

బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ త‌న 38వ జ‌న్మ‌దిన వేడుక‌లని కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గ్రాండ్‌గా జ‌రుపుకుంది. భ‌ర్త సైఫ్ అలీఖాన్‌, సోద‌రి క‌రీష్మా క‌పూర్, తండ్రి ర‌ణ‌దీర్ క‌పూర్‌, త‌ల్లి బ‌బ‌తి క‌పూనర్, సైఫ్ సోద‌రి సోహా అలీఖాన్‌, ఆమె భ‌ర్త కునాల్ కేము మ‌రియు స్నేహితులు పుట్టిన రోజు వేడుక‌కు హాజ‌రు కాగా వారంద‌రి స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసింది క‌రీనా. అయితే ఈ బర్త్ డే వేడుక‌కి సైఫ్‌, కరీనాల గారాల ప‌ట్టీ తైమూర్ అలీఖాన్ మిస్ అయ్యాడు. కరిష్మా త‌న సోద‌రి బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలని, వీడియోల‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. బ‌ర్త్ డే వేడుక‌లో అంద‌రు బ‌ర్త్‌డే క్యాప్స్ ధ‌రించగా, కొంద‌రు బెలూన్స్ ప‌ట్టుకొని ఫోటోల‌కి ఫోజులిచ్చారు. ముఖ్యంగా పుట్టిన రోజు వేడుక‌లో బ‌ర్త్‌డే కేక్ అంద‌రిని ఆక‌ట్టుకుంది. న‌ల్ల‌ని రంగు దుస్తులు ధ‌రించి కేక్‌పై కూర్చొని డ్రింక్ తాగుతున్న‌ట్టుగా కరీనా బొమ్మని ఉంచారు . యూ ఆర్ అవ‌ర్ రాక్ స్టార్ తో పాటు హ్యాపీ బ‌ర్త్ డే బెబో అని కేక్‌పైన ఉంది. క‌రీనా న‌టించిన వీరే ది వెడ్డింగ్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌గా , త్వరలో ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది క‌రీనా . ఈ చిత్రానికి ధర్మా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, జాన్వి కపూర్‌, భూమి పెడ్నేకర్‌, విక్కీ కౌశల్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.
View this post on Instagram

Sparkle and shine !!! Happy birthday !!! ❤️❤️🎂

A post shared by Soha (@sakpataudi) on

View this post on Instagram

Birthday boomerang!!!

A post shared by Soha (@sakpataudi) on

View this post on Instagram

Family fun ❤️ #birthdaygirl #bebo #ourrockstar 🌟 #lafamilia

A post shared by KK (@therealkarismakapoor) on

View this post on Instagram

❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Related Stories: