కావరియాల కోపానికి కారు బలి

గంగాజలాన్ని తెచ్చుకునేందుకు ఏటా హరిద్వార్ వంటి పుణ్యతీర్థాలకు వెళ్లివచ్చేవారిని కావరియాలు అని పిలుస్తారు. వీరు కాషాయం కట్టుకుని గుంపులుగుంపులుగా కాలినడకన ప్రయాణిస్తారు. గంగాజలాన్ని స్వస్థలానికి తెచ్చిన తర్వాత తమతమ ఊళ్లలోని శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు. ఇలా పవిత్యరా యాత్రపై బైలుదేరిన కావరియాలు ఢిల్లీలో రెచ్చిపోయారు. తమను రాసుకుంటూ వెళ్లిందని ఆగ్రహించి ఓ కారుపై తమ ప్రతాపం చూపారు. లాఠీలతో పొట్టుపొట్టు చేశారు. చివరికి ఆగ్రహం పట్టలేక పడదోశారు. అందులోని ప్రయాణికులు ఎంత చెప్తున్నా వినలేదు. వారు కారును వదిలేసి పక్కకు తప్పుకోవడంతో ఎవరికీ గాయాలు తగులలేదు. పోలీసులు, దారిన పోయేవారు చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కారులో ప్రయాణిస్తున్న జంట ఫరియాదు చేసేందుకు కూడా భయపడుతున్నారు. దాంతో పోలీసులు తమంతట తాముగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: