కంటి వెలుగు శిబిరాలు కిటకిట

హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ కంటివెలుగు శిబిరాలకు 18వ రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విశేషస్పందన కనిపించింది. కంటివెలుగు శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. మంగళవారం సర్వర్ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కంటివైద్య శిబిరాల్లో సేవలు పొందినవారి వివరాలకు సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో మంగళవారం 31,378 మందికి కంటిపరీక్షలు నిర్వహించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఇందులో 7,617మందికి కండ్లద్దాలు పంపిణీచేయగా.. 2,463 మందిని శస్త్రచికిత్సలకు రిఫర్‌చేశారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 2,868 మందికి కంటిపరీక్షలు చేయగా, 60 మందికి కండ్లద్దాలను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు 78,803 మంది కంటిపరీక్షలు చేయించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో ఇప్పటివరకు లక్షా రెండువేల మంది వైద్య పరీక్షలు చేయించుకోగా.. 11,147 మందికి కండ్లద్దాలు అందించా రు. వనపర్తి జిల్లాలో 34,628 మందికి పరీక్షలు నిర్వహించగా.. 4,689 మందికి అద్దాలు పంపిణీ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 74,822 మందికి పరీక్షలు ని ర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా లో 44,756 మంది కి కంటిపరీక్షలు నిర్వహించారు.

చూపు మెరుగుపడింది

కంటివెలుగు శిబిరంలో డాక్టర్లు ఇచ్చిన కండ్లద్దాలు పెట్టుకున్న తర్వాత నా కంటిచూపు మెరుగుపడింది. గతంలో మసకమసకగా కనిపించేవి. కంటి అద్దాలతో సమస్య తీరింది. - తెలుగు ఈశ్వరయ్య, సుల్తానాపురం, అలంపూరు మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా