ప్రముఖ హీరో, అతని ముగ్గురు స్నేహితులు అరెస్ట్

బెంగళూరు: కన్నడ హీరో, దునియా ఫేం విజయ్‌ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌ జిమ్‌ ట్రైనర్‌ మారుతి గౌడపై దాడి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో..అతనితోపాటు మరో ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీ రవి శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ..జిమ్ ట్రైనర్ ఫిర్యాదు మేరకు విజయ్‌తోపాటు అతని ముగ్గురు స్నేహితులను కస్టడీలోకి తీసుకున్నాం. నిందితులు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. వారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో కారణాలు చెప్పారు. కేసు విచారించిన మెట్రోపాలిటన్ కోర్టు నిందితులను 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించమని ఆదేశించింది.‌ నలుగురిని సెంట్రల్‌ జైలులో ఉంచి విచారణ జరుపుతున్నామని అన్నారు.

Related Stories: