సినిమాల‌కి గుడ్‌బై చెప్ప‌నున్న క‌మ‌ల్ హాస‌న్‌..!

సినిమాల‌తో అల‌రించే న‌టులు ఇప్పుడు పార్టీలు స్థాపించి ప్ర‌జా రాజ‌కీయ జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలో వారు సినిమాల‌కి గుడ్ బై చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు క‌మ‌ల్ హాసన్ కూడా అదే దారిలో వెళుతున్న‌ట్టు సంకేతాలు అందుతున్నాయి. ఆ మ‌ధ్య ‘మక్కల్ నీది మయమ్’ అనే పార్టీ స్థాపించిన క‌మ‌ల్ ఇప్పుడు పార్టీ సంస్థాగత ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు త‌న తాజా చిత్రాలు విశ్వ‌రూపం 2, శ‌భాష్ నాయుడు, భార‌తీయుడు సీక్వెల్‌కి సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే క‌మ‌ల్ హాస‌న్ త‌న ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ఈ క్ర‌మంలో ఓ అభిమాని ఒకరు మీరు సత్యజిత్ రేఎం, శ్యామ్ బెంగాల్ వంటి దర్శకులతో పనిచేయకపోవడం పై బాధపడుతున్నారా అని అడగ్గా కమల్ సమాధానం ఇస్తూ వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళు నాకు ఎప్పుడూ సినిమా ఆఫర్ ఇవ్వలేదు. పైగా సత్యజిత్ రే ఇప్పుడు లేరు. నేను కూడా ఇకపై సినిమాలు చేయబోవడం లేదు అంటూ తాను త్వ‌ర‌లో సినిమాలనుండి రిటైర్ కానున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య