కాకినాడ ఓట్ల లెక్కింపు షురూ..

ఆంధ్రప్రదేశ్ : తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు ఓట్ల లెక్కింపు కోసం రంగరాయ వైద్య కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 29న జరిగిన నగరపాలక ఎన్నికల్లో మొత్తం 48 డివిజన్లకు సంబంధించి 241 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నగరపాలక ఎన్నికల్లో మొత్తం 1,48,598 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏపీ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Related Stories: