కాజ‌ల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేకింగ్ వీడియో విడుద‌ల‌

క‌లువ క‌ళ్ళ సుందరి కాజ‌ల్ నిన్న( జూన్ 19) త‌న 33వ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ని ఘ‌నంగా జ‌రుపుకుంది. అభిమానులు, సెల‌బ్రిటీలు ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ న‌టిస్తున్న క్వీన్ రీమేక్ చిత్రం త‌మిళంలో ప్యారిస్ ప్యారిస్ పేరుతో రూపొందుతుంది. ర‌మేశ్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. కాజ‌ల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మేకింగ్ వీడియో విడుద‌ల చేసారు. ఈ వీడియోలో ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ కాజ‌ల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మేకింగ్ వీడియో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేలా ఉంది. కాజ‌ల్ మ‌రోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న‌ సినిమా కూడా చేస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ క్వీన్ సౌత్ లోని నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో కంగనా రనౌత్ పోషించిన పాత్రని తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ లు పోషిస్తున్నారు. క్వీన్ రీమేక్ చిత్రం కన్నడలో బటర్ ఫ్లై అనే టైటిల్‌తో తెరకెక్కుతుండగా, తమిళంలో పారిస్ పారిస్, మలయాళంలో జామ్ జామ్, తెలుగులో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ అనే టైటిల్స్ తో రూపొందుతుంది. బాలీవుడ్ చిత్రం 'క్వీన్' ను నిర్మాత త్యాగరాజన్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్ర సీన్స్ కొన్ని నీల‌కంఠ తెర‌కెక్కించ‌గా , ప‌లు కార‌ణాల వ‌ల‌న మ‌ధ్య‌లో చిత్ర షూటింగ్‌కి బ్రేక్ పడింది. తమిళ, కన్నడ భాషల్లో రమేష్ అరవింద్ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మిగ‌తా భాష‌ల‌లో అ ఫేం ప్ర‌శాంత్ వర్మ రీమేక్ చేస్తున్నాడు.

Related Stories: