యంగ్ హీరోతో జతకట్టిన కాజల్

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని కాజల్ తూచా తప్పక పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు ప్రత్యేక గీతాలు చేస్తుంది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందుకున్న ఈ భామ కుర్ర హీరోలతోను జతకట్టేందుకు సిద్ధమైంది. చివరిగా అ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్ క్వీన్ రీమేక్ లో నటిస్తుంది. ఇక ఇప్పుడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలోను కథానాయికగా నటిస్తుంది.వంశధార క్రియేషన్స్ బేనర్ పై శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, నేడు చిత్ర బృందంతో కలిసింది కాజల్. బెల్లంకొండ శ్రీనివాస్ తన ట్విట్టర్ ద్వారా సెట్స్ కి ఎవరు వచ్చారో చూశారా. స్వాగతం కాజల్. నా కజిన్ తో కాజల్ సరదా సమయం గడుపతుంది అనే కామెంట్ పెట్టి సరదా వీడియోని సామాజిక మాధ్యమంలో షేర్ చేశాడు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు 9.50 కోట్లకి అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. థమన్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా బెల్లంకొండ నాలుగో చిత్రం సాక్ష్యం జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే.

× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం