కాజల్ కి కోర్టులో నిరాశే ఎదురైంది

కలువ కళ్ళ సుందరి కాజల్ 2008లో వీవీడి కొబ్బరి నూనె కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థతో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది కాజల్. అయితే ఏడాది తర్వాత కూడా ఆ యాడ్ టీవీలలో ప్రసారం కావడంతో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఒప్పందం ముగిసినప్పటికి తన ఫోటోను ఆ సంస్థ వాడుకుంటుందని అందుకు నష్టపరిహారంగా ఆ సంస్థ రెండున్నర కోట్లు చెల్లించాలంటూ ఆదేశం ఇవ్వాలని కాజల్ కోర్టుని కోరింది. దీనిపై తుది విచారణ జరిపిన జడ్జి జస్టిస్ టీ రవీంద్రన్ 60 సంవత్సరాల పాటు ఆ యాడ్ పై హక్కులు ఆ సంస్థకి ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో యాడ్ ని ఏడాది తర్వాత ప్రసారం చేయకూడదని కాజల్ డిమాండ్ చేయడం తప్పు అని అన్నారు. దీంతో కాజల్ కి కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ తమిళ చిత్రం మెర్సల్ లో నటిస్తుంది. తెలుగులో రానా సరసన నటించిన నేనే రాజు నేనే మంత్రి రేపు విడుదల కానుంది.
× RELATED తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం