అర‌వింద స‌మేత‌లో కాజ‌ల్‌..!

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అర‌వింద స‌మేత‌. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన‌ ఓ వార్త ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్‌తో క‌లిసి నేను ప‌క్కాలోక‌ల్ అనే ప్ర‌త్యేక గీతానికి చిందేసిన కాజ‌ల్ ఇప్పుడు మ‌రోసారి ఎన్టీఆర్‌తో కాలు క‌దప‌నుందట‌. అరవింద స‌మేత చిత్రంలో త్రివిక్ర‌మ్ ఓ స్పెష‌ల్ సాంగ్ డిజైన్ చేయగా, ఇందులో కాజ‌ల్ అయితే బాగుంటుంద‌ని టీం భావించింద‌ట‌. ఈ మేర‌కు నిర్మాత‌లు కాజ‌ల్‌తో సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది. కాజ‌ల్‌- ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వచ్చిన బృందావ‌నం, టెంప‌ర్, బాద్‌షా సినిమాలు మంచి విజ‌యం సాధించడంతో ఈ కాంబినేష‌న్‌పై మంచి క్రేజ్ నెల‌కొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రాఘ‌వ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని, అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్డే సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించి అభిమానులకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..