టాలీవుడ్ చంద‌మామ సినిమాల‌కి గుడ్‌బై చెప్ప‌నుందా ?

ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు హీరోయిన్స్ సినిమాలు చేస్తూనే వ్యాపార రంగంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా బిజినెస్ ప్లాన్ చేస్తుంద‌ని, సినిమాలు పూర్తిగా మానేసి వ్యాపారంపైనే పూర్తి దృష్టి పెట్ట‌నుంద‌ని పుకార్లు షికారు చేశాయి. దీనిపై కాజ‌ల్ ఓ ఆంగ్ల ప‌త్రిక‌తో మాట్లాడుతూ.. సినిమాలు మానేస్తాను అని వ‌స్తున్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేదు. వ్యాపారం చేసే ఉద్దేశం అస‌లే లేదు. ఈ ఏడాది ‘ఖైదీ నెం.150’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వివేగం’, ‘మెర్సల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించాను. ఇంత మంచి అవకాశాలు, విజయాలు అందుతున్నప్పుడు సినిమాలు మానేయాల్సిన అవసరం నాకేంటి?’ అని అన్నారు కాజ‌ల్‌. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన క్వీన్ కి రీమేక్‌గా పారిస్ పారిస్ అనే త‌మిళ చిత్రంలో కాజ‌ల్ కథానాయికగా నటిస్తుంది. ర‌మేష్ అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఇక క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఎంఎల్ఏ చిత్రంలోను కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Related Stories: