ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ముఖ్య పాత్ర కోసం కైకాల‌

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్స్ లో ఎన్టీఆర్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తుండగా, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించి కొంత క్లారిటీ వ‌స్తుంది. ప్ర‌స్తుత ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తుండ‌గా, ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మంజిమో మోహ‌న్ న‌టిస్తుంది. ఇక శ్రీదేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ ,మరో కీలక పాత్ర హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీసుకున్న‌ట్టు సమాచారం.1949 జూలై 5న ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం షూటింగ్ ప్రారంభమైంది. ఓ గొప్ప చరిత్రకు శ్రీకారం జరిగిన ఆ పవిత్రమైన రోజున ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంబించారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

× RELATED రెండేండ్లుగా ఏసీ ట్రక్కుల్లోనే వందల శవాలు