హెచ్.ఎం రెడ్డి పాత్రలో సీనియర్ నటుడు కైకాల..ఫస్ట్ లుక్

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు సినిమా పితామహుడు, ప్రముఖ నిర్మాత హెచ్.ఎం రెడ్డి పాత్రలో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నటిస్తున్నారు. సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం చిత్రబృందం ఆయన లుక్‌ను విడుదలచేసింది. ఇందులో భూతద్ధంలో సినిమా రీలును నిశితంగా గమనిస్తూ కనిపిస్తున్నారు సత్యనారాయణ. ఎచ్.ఎం.రెడ్డి పాత్రలో సత్యనారాయణ అద్వితీయమైన నటనను కనబరిచారని దర్శకుడు క్రిష్ తెలిపారు. మంగళవారంతో ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఎన్.బి.కె. స్టూడియోస్ పతాకంపై సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, ప్రసాద్‌లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Stories: