కైకాల మ‌ర‌ణించినట్టు వార్త‌లు.. క్లారిటీ ఇచ్చిన 'మా'

సోష‌ల్ మీడియాలో కొంద‌రు నెటిజ‌న్స్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిండంతో అభిమానులు ఎంతో ఆందోళ‌న‌కి గుర‌వుతున్నారు. బ్ర‌తికున్న సెల‌బ్రిటీల‌ని చనిపోయారంటూ ప్ర‌చారం చేయ‌డం కొంత‌కాలంగా జ‌రుగుతూ వ‌స్తుంది. దీనిపై స‌ద‌రు ప్ర‌ముఖులు ఫైర్ అవుతూ, మేము బ‌తికే ఉన్నామ‌ని క్లారిటీ ఇచ్చుకోవల‌సిన ప‌రిస్థితి వ‌స్తుంది. తాజాగా ప్ర‌ముఖ నటుడు కైకాల స‌త్య‌నానారాయ‌ణ అనారోగ్యంతో మృతి చెందార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం చేశారు. కొంద‌రు ఈ వార్త విని షాక్ కి గుర‌య్యారు. అయితే నిన్న వంకాయల సత్యనారాయణ మూర్తి మృతి చెంద‌డంతో ఆయ‌న‌కి బదులుగా కైకాల సత్యనారాయణ మరణించినట్టుగా సోషల్‌ మీడియలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసింది. కైకాల స‌త్యనారాయ‌ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారు. ద‌యచేసి ఇలాంటి పుకార్ల‌ని న‌మ్మోద్దు అని కోరారు. గ‌తంలో ల‌య‌, వేణు మాధ‌వ్‌, కోట శ్రీనివాస రావు, చంద్ర‌మోహ‌న్ , చంద్ర‌ముఖి ద‌ర్శ‌కుడు పి.వాసు చ‌నిపోయారంటూ పుకార్లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే.

Related Stories: