తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అదికారులు దగ్గరుండి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులచే కడియం దంపతులకు ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవీ భాద్యతలు చేపట్టాలన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఆశీర్వదించాలని ఆదేవదేవుణ్ణి ప్రార్దించానని కడియం పేర్కొన్నారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..