సర్వేపల్లి విగ్రహానికి డిప్యూటీ సీఎం కడియం నివాళులు

హైదరాబాద్ : నేడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విద్యావేత్త, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు, పలువురు అధికారులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, స్వరాష్ట్రంలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని కడియం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరినీ సగౌరవంగా సన్మానించుకుందామన్నారు.

Related Stories: