కోఠి ఉమెన్స్ కాలేజీలో క‌డియం ఆక‌స్మిక త‌నిఖీ

హైద్రాబాద్: డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి ఇవాళ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఆక‌స్మిక త‌నిఖీ నిర్వ‌హించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు కాలేజీకి వెళ్లిన మంత్రి అక్క‌డ ఉన్న విద్యార్థులు, టీచ‌ర్ల‌ను క‌లుసుకున్నారు. కాలేజీ విద్యార్థుల‌కు క‌ల్పిస్తున్న వ‌స‌తుల‌పై ఆయ‌న యాజ‌మాన్యంతో మాట్లాడి తెలుసుకున్నారు. కాలేజీ ఆవ‌ర‌ణ‌లో మంత్రి క‌డియం మొత్తం క‌లియ‌తిరిగారు. ప్రొఫెస‌ర్లు ఎలా బోధిస్తున్నార‌ని ఆయ‌న విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇంట‌ర్‌, డిగ్రీ ప‌రీక్ష‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో .. విద్యార్థుల‌తో మాట్లాడిన మంత్రి వారికి మ‌నోధైర్యాన్ని క‌లిగించారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం