రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: కడియం

హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు, మీ కుటుంబ సభ్యులు చేపట్టే కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ఆశిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. సీఎం కేసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. ఈ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరి..ఆత్మగౌరవంతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నట్లు కడియం తెలిపారు.

Related Stories: