పాటలు పాడనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

రాజ్యాంగం, చట్టాలు, కేసులతో కుస్తీలు పట్టే న్యాయమూర్తులు పాటలుకూడా పాడుతారా? సుదీర్ఘ మల్లగుల్లాల అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇటీవలే నియమితులైన జస్టిస్ కేఎం జోసెఫ్ ఢిల్లీలో కేరళ వరదబాధితుల సహాయార్థం జరుగనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో గొంతు విప్పనున్నారు. సుప్రీంకోర్టు వార్తలను సేకరించే జర్నలిస్టులు ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆడిటోరియంలో సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్వయంగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జోసెఫ్ ఒక మలయాళ పాట, ఒక హిందీ పాట.. మొత్తం రెండు పాటలు ఆలపించబోతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం సిటింగ్ జడ్జి బహిరంగ కార్యక్రమంలో గీతాలాపన చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్లేబ్యాక్ సింగర్ మోహిత్ చౌహాన్, వర్ధమాన శాస్త్రీయ నృత్యకారిణి కీర్తనా హరీశ్ కూడా ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు.
× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158