తండ్రితో త‌న‌యుడు బాక్సింగ్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ అభిమానుల‌కి మాంచి కిక్ ఇచ్చింది. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో స‌ర‌దాగా టైం స్పెంట్ చేసేందుకు ఎన్టీఆర్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటాడు. అంతేకాదు పిల్ల‌ల‌తో తాను ఆడే స‌ర‌దా ఆట‌లని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు తార‌క్‌. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద కుమారుడు అభ‌య్ రామ్‌తో క‌లిసి తీసుకున్న వీడియో షేర్ చేశాడు. ఇందులో అభ‌య్.. తార‌క్ బుగ్గ‌ల‌పై బాక్సింగ్ స్టైల్‌లో పంచ్‌లు ఇస్తున్నాడు. ఈ వీడియోకి ఎన్టీఆర్ మీ అబ్బాయికి మీరు పంచింగ్‌ బ్యాగ్‌ అయినప్పుడు..’ అని క్యాప్షన్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్మీ ప్ర‌ణ‌తి జూన్ 14న పండంటి మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. భార్గ‌వ్ రామ్ అనే పేరుని చిన్న కుమారుడికి పెట్టిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఫ్యామిలీ పిక్‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు తార‌క్‌. ఈ పిక్ నంద‌మూరి అభిమానుల ఆనందాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ళింది. ఇక ఎన్టీఆర్ న‌టిస్తున్న అర‌వింద స‌మేత చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండ‌గా, ఈ మూవీలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చిత్రంలో నాగ‌బాబు, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర లు పోషిస్తుండ‌గా, ఈషా రెబ్బ‌ని కీల‌క పాత్ర కోసం సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

When you become a #punchingbag for your son #karatekid #elderbrat #lazysunday

A post shared by Jr NTR (@jrntr) on

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..