ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో

జకార్త:ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో మరోసారి ఎన్నికయ్యారు. అధ్యక్షుడి ఎన్నికలు గతనెల 17న జరుగగా, మంగళవారం విడోడో గెలుపొందినట్టు అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల్లో తమను మోసం చేశారని ఆరోపిస్తూ ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటో.. పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం కొంచెం ఆలస్యంగా ఫలితాలను విడుదల చేసింది. ఉగ్రకార్యకలాపాలతో సంబంధాలున్నాయని పదుల సంఖ్యలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకొన్నామని పోలీసులు చెప్పారు.