టీఆర్ఎస్ లోకి కొనసాగుతున్న చేరికలు

పెద్దపల్లి జిల్లా: టీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. కాటారం మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో మంథని టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంథనిలో పుట్ట మధు సమక్షంలో మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన 50 మంది స్థానికులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరానికి చెందిన వివిధ పార్టీల నాయకులు తాజా మాజీ ఎమ్మెల్యే వీరేశం సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వేముల వీరేశం వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

Related Stories: