బీజేపీతో చేతులు కలుపు.. సీఎం అయిపో!

హైదరాబాద్: కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్‌దాస్ అథవాలే.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ ఎన్డీయేలో చేరితే ఆయనకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు ఉంటుంది. అంతేకాదు ఎన్డీయే మద్దతుతో ఆయన ఏపీ సీఎం అయిపోవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడతా అని అథవాలే అన్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు.

ఎన్డీయే నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వెళ్లిపోవాలన్న నిర్ణయం తొందర్లో తీసుకున్నదని అథవాలే అభిప్రాయపడ్డారు. ఆయన ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నారు. దానిని ఎన్డీయే ప్రభుత్వమే ఇచ్చేదే. అయితే ఇప్పుడు ఆయన ఎన్డీయేతో లేకపోవడంతో బాబుకు నా నుంచి, నా పార్టీ నుంచి మద్దతు ఉండదు. ముందు ఎన్డీయేలో చేరితే తర్వాత మా అందరి మద్దతు ఉంటుంది అని అథవాలే అన్నారు.

× RELATED ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..