సూచనలకు అనుగుణంగా.. లెక్కింపు చేపట్టాలి

-ఓట్ల లెక్కింపు అధికారులతో వీసీ గద్వాల, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల లె క్కింపు ప్రక్రియలో రాజకీయ నాయకులకు ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా కౌంటింగ్ చేపట్టాలని తెలంగాణ ప్రత్యేక ఓట్ల లెక్కింపు పరిశీలకులు వినోద్‌జూద్సి అన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జి ల్లా కలెక్టర్లు, ఎస్పీ, ఎ న్నికల అబ్జర్వర్లతో హై ద్రబాద్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మాట్లాడారు. పార్లమెంట్ ఓట్ల లెక్కింపు సవాలుగా తీ సుకుని లెక్కింపు సందర్భంగా వచ్చే వివిధ స వాళ్ల విషయంలో ఎక్క డా తొందర పడకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గనిర్ధేశాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆయ న సూచించారు. ప్రిసైడింగ్ అధికారి సంతకం చేసిన 17(సి)ఈవీఎంలలో ఉన్న ఓట్లలో తేడాలు వస్తే ఏమి చేయాలి, సీఆర్‌సీ చేయకుండా వచ్చిన ఈవీఎంల విష యం, ఐదు వీవీప్యాట్‌లు ఎంచుకునే క్రమం వంటి సమస్యలను ఏవిధంగా అధిగమించాలి అనే విషయాలపై దిశానిర్ధేశం చేశారు. ఈ వీసీలో పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు లెక్కింపు ప్రక్రియపై పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జోగులాంబ గద్వాల, ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకై ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి ఇవ్వడంతో పాటు లెక్కింపు కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. వీసీలో ఎస్పీ లక్ష్మీనాయక్, బెటాలియన్ డీఎస్పీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: