ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

- రాష్ట్ర స్థాయిలో 942 మార్కులతో 4వ స్థానం సాధించిన అయిజ విద్యార్థి జాన్సన్ - ఫస్టియర్‌లో 52 శాతం, సెకండియర్‌లో 55శాతం ఉత్తీర్ణత - రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఫస్టియర్‌లో 15వ స్థానం సెకండియర్‌కు 20వ స్థానం - ఫస్టియర్‌లో 58శాతం, సెకండియర్‌లో 61శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పై చేయి గద్వాల న్యూటౌన్ : ఇంటర్ ఫస్టియర్, సెంకడియర్ ఫలితాలు గురువా రం విడుదలయ్యాయి. ఇంటర్ ఫలి తా ల్లో ఈ సారి జిల్లాలో బాలికలదే హవా కొనసాగింది. జోగుళాంబ గద్వాల జిల్లా ఇంటర్ ఫస్టియర్‌లో 52శాతం ఉత్తీర్ణత ను సాధించి రాష్ట్రస్థాయిలో 15 వ స్థానం, సెకండియర్‌లో 55 శాతం ఉత్తీర్ణతో 20వ స్థానంలో నిలిచింది. ఫస్టియ ర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్‌లో 58 శా తంతో బాలికలు, 45 శాతంతో బాలు రు ఉత్తీర్ణులయ్యారు. అదే విధంగా సె కండియర్‌లో 61 శాతంతో బాలికలు, 48 శాతంతో బాలురు ఉత్తీర్ణులయ్యా రు. జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్ పరీక్షలకు 2,850 మంది విద్యార్థులు హాజరు కా గా 1,470 (52శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,373 మంది బాలికలకు 800 మంది (58 శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. అదే విధంగా 1,477 మంది బాలురకు 670 మంది (45 శా తం) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సె కండియర్‌లో 2,419 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకాగా 1,332 మం ది (55శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,190 మంది బాలికలకు 731 మంది (61శాతం) ఉత్తీర్ణులు అయ్యారు. అలా గే 1,229 మంది బాలురకు 601 మం ది (48శాతం) ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం వివరాలు.. జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యా ర్థినులు ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్‌లో 59 శాతం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్టియర్‌లో 60 శాతం, సెకండియర్‌లో 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ధరూర్ ఫస్టియర్ 80 శాతం, సెకండియర్ 78 శాతం, మల్దకల్ జూనియర్ కళాశాల ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్‌లో 60 శాతం, గట్టు జూనియర్ కళాశా ల విద్యార్థు లు ఫస్టియర్‌లో 63 శా తం, సెకండియర్‌లో 57 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదే వి ధం గా అలంపూ ర్ ప్ర భుత్వ జూనియర్ కళాశాల వి ద్యార్థులు ఫస్టియర్‌లో 45శాతం, సె కండియర్‌లో 66శాతం, అయిజ ప్రభు త్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఫస్టియర్‌లో 64శాతం, సెకండియర్‌లో 89 శాతం, మానవపాడు ఫస్టియర్‌లో 38 శాతం, సెకండియర్‌లో 67 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా అయిజ ప్రభు త్వ జూనియర్ కళాశాలకు చెందిన సెకండియర్ విద్యార్థి జాన్సన్ హెచ్‌ఈసీ విభాగంలో 942 మార్కులతో రాష్ట్ర స్థాయి లో 4వ స్థానం సాధించినట్టు జిల్లా ఇంటర్ బోర్డు నోడ ల్ అధికారి హృదయరాజు తెలిపారు.

Related Stories: