తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

- సంక్షేమ పథకాలకు ఆకర్శితులై టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు - అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం - సర్పంచ్‌తో పాటు 300 మంది గులాబీ గూటికి.. - కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అయిజ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని, ప్రభుత్వసంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వారందరికీ పార్టీలో తగు ప్రాధాన్యతను ఇస్తామని అలంపూర్ ఎమ్మెల్యే డా.వీఎం అబ్రహం పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని యాపదిన్నె, కుర్వపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 300 మంది అలంపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విష్ణువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అలంపూర్ చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన యాపదిన్నె గ్రామ సర్పంచ్ ఇన్సెంట్, ఉపసర్పంచ్ బీసన్న, ఆరుమంది వార్డు మెంబర్లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత టీఆర్‌ఎస్ పారీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులకు కొత్తపట్టాదారు పాసు పుస్తకాలు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఎకరాకు పదివేలు అందించడం, రైతు అకారణంగా మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలను అందించడం వంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పేద, మధ్యతరగతి ఆడబిడ్డల వివా హాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించడం లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకర మన్నారు. అలంపూర్ నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రా రంభించడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుండటాన్ని గ్రహించిన కాంగ్రెస్ వర్గీయులు గులాబీ గూటికి చేరుతున్నారని చెప్పారు. ఇక అలంపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింద న్నారు. త్వరలో జరగబోయే ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకీ ప ట్టం కట్టాల ని ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరినవారిలో కరుణాకర్‌రెడ్డి, ఆంజనే యులు, కమలన్న, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బోయబజారి, గొ ల్ల వెంక టేశ్, హరి, రామకృష్ణ, రాముడు, కిష్టన్న, బీసన్న, లింగన్న, సవారి, సో మన్న, కృష్ణ తదితరులు ఉన్నారు.

Related Stories: