మహాగణపతి హోమంలో పాల్గొన్న జోగు రామన్న

ఆదిలాబాద్: పట్టణంలోని గంగపుత్ర సంఘం శివాలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి హోమంలో మంత్రి జోగు రామన్న దంపతులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగా నంద సరస్వతి, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ హోమంలో నవ ధాన్యాలను వేస్తూ హోమాది పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు రామన్న చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరామన్నారు.

Related Stories: