స్టార్ ఇండియాతో జియో ఒప్పందం.. జియో టీవీలో క్రికెట్ మ్యాచ్‌లు..!

టెలికాం సంస్థ రిలయన్స్ జియో స్టార్ ఇండియాతో 5 ఏళ్లకు గాను పార్ట్‌నర్‌షిప్‌ను కుదుర్చుకుంది. అందులో భాగంగా భారత్‌లోని యూజర్లకు హాట్‌స్టార్‌తోపాటు జియో టీవీ యాప్‌లో కూడా క్రికెట్ మ్యాచ్‌ ప్ర‌సారాలు అందుబాటులో ఉంటాయి. ఈ పార్ట్‌నర్‌షిప్‌లో భాగంగా స్టార్ స్పోర్ట్స్‌లో వచ్చే టీ20, వన్‌డే, టెస్ట్, బీసీసీఐ ప్రీమియర్ డొమెస్టిక్ టోర్నమెంట్ మ్యాచ్‌ల ప్రసారాలు హాట్‌స్టార్ యాప్‌తోపాటు జియో టీవీలోనూ వస్తాయి. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా జియో టీవీ యాప్‌లో యూజర్లకు పలు భారతీయ భాషల కామెంటరీతో కూడిన మ్యాచ్‌లను ప్రసారం చేశారు. దీంతోపాటు యూజర్లు యాప్‌లో తమకు నచ్చిన కెమెరా యాంగిల్, మైక్‌లతో ప్రసారాలను చూసే వెసులుబాటు కల్పించారు. అందులో భాగంగాఏ జియో క్రికెట్ సీజన్ ప్యాక్, జియో ధన్ ధనా ధన్ లైవ్ కామెడీ క్రికెట్ షోలను కూడా ఐపీఎల్ సందర్భంగా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని క్రికెట్ ప్రేమికులకు మరింత వినూత్న రీతిలో మ్యాచ్ ప్రసారాలను అందించడం కోసమే స్టార్ ఇండియాతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ వెల్లడించారు.

Related Stories: