జియో బంపర్ ఆఫర్.. ఒప్పో ఫోన్లు కొంటే రూ.4,900 వరకు బెనిఫిట్స్..!

ఒప్పో స్మార్ట్‌ఫోన్లను కొనే యూజర్లకు జియో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నూతనంగా ఒప్పో 4జీ స్మార్ట్‌ఫోన్లను కొనే వారు తమ ఫోన్లలో జియో సిమ్‌లు వేసి వినియోగిస్తే రూ.4900 వరకు బెనిఫిట్స్ వస్తాయి. అందుకు గాను వినియోగదారులు తమ సిమ్‌లను రూ.198 లేదా, రూ.299 ప్లాన్లతో రీచార్జి చేయించాలి. ఈ ప్లాన్లలో వరుసగా రోజుకు 2జీబీ, 3జీబీ డేటాను అందిస్తున్నారు. వీటి వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

జియో, ఒప్పోలు కలిసి అందిస్తున్న ఈ మాన్‌సూన్ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారులు ఒప్పో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాక అందులో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌ను రీచార్జి చేయాలి. దీంతో కస్టమర్లకు ఒక్కోటి రూ.50 విలువైన మొత్తం 36 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూపన్లు వస్తాయి. వీటి విలువ రూ.1800. వీటిని కస్టమర్లు తరువాతి రీచార్జిలకు వాడుకుని ఆ మేర డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కూపన్ల వాలిడిటీ సెప్టెంబర్ 30, 2021 గా నిర్ణయించారు.

అలాగే కస్టమర్లు చేసే రీచార్జిలకు అనుగుణంగా 13, 26, 39వ రీచార్జిలకు ఒక్కోటి రూ.600 చొప్పున మొత్తం మూడు సార్లు కలిపి రూ.1800 జియో మనీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. దీంతోపాటు రూ.1300 విలువైన మేక్ మై ట్రిప్ ఓచర్లను కూడా వినియోగదారులకు ఇస్తారు. ఈ క్రమంలో మొత్తం కలిపి 1800+1800+1300 = 4900 అవుతాయి. ఇలా కస్టమర్లు రూ.4900 క్యాష్ బెనిఫిట్స్‌ను పొందవచ్చు.

ఒప్పోకు చెందిన అన్ని 4జీ స్మార్ట్‌ఫోన్లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కానీ ఒక్క రియల్ మి 1 ఫోన్‌కు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఇక ఈ ఆఫర్ జూన్ 28వ తేదీ నుంచి అందుబాటులోకి రాగా సెప్టెంబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది.

Related Stories: