జియో మరో ఆఫర్.. రీచార్జిలపై రూ.50 క్యాష్‌బ్యాక్..!

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో ఆఫర్‌ను ప్రకటించింది. రూ.300 ఆపైన చేసే రీచార్జిలపై రూ.50 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అయితే కస్టమర్లు ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 24 గంటల్లోగా కస్టమర్ ఫోన్‌పే వాలెట్‌కు రూ.50 క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను వినియోగదారులు రీచార్జిలకు, బిల్ పేమెంట్స్‌కు ఉపయోగించుకోవచ్చు. కేవలం ఒకసారి మాత్రమే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ నెల 21వ తేదీ వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు గడువు ఉన్నట్లు జియో తెలిపింది.

× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం