‘జియో గిగాఫైబర్‌’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

న్యూఢిల్లీ: టెలికం రంగంలో దూసుకుపోతున్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో.. అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను త్వరలో ప్రారంభించబోతున్నది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. దీని ద్వారా గిగాబైట్‌ వైఫై, టీవీ, స్మార్ట్‌ హోమ్‌, ఉచిత కాలింగ్‌ వంటి సేవలను పొందవచ్చని కంపెనీ చెప్పింది. వినియోగదారులకు 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో సంస్థ ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాల్లో ఈ ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్లు గత నెలలో ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నదో మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ కనెక్షన్‌ కావాలనుకుంటే, రిలయన్స్‌ జియో 4జీ మొబైల్‌ సేవలు వినియోగించుకుంటున్న వారు, మొబైల్‌లోని మైజియో యాప్‌లో, సంస్థ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.

× RELATED ఓటరు అవగాహనలో పాల్గొన్న రజత్ కుమార్