తెలుగులో జ్యోతిక సినిమా.. మ‌రో నాలుగు రోజుల‌లో విడుద‌ల‌

ఒకప్పుడు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఉన్న జ్యోతిక, త‌మిళ హీరో సూర్య‌ని వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంది. తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌లో న‌టించిన జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. మంచి స్క్రిప్ట్ లని ఎంచుకుంటూ వెళుతున్న జ్యోతిక ఐకానిక్ ఫిలిం మేకర్ బాలా డైరెక్షన్ లో నాచియార్ అనే సినిమా చేసింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో క్రూర‌మైన పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించింది. రిలీజ్ కి ముందు ఆమె పాత్ర‌కి విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌, త‌ర్వాత మంచి ప్రశంస‌లు ల‌భించాయి. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇత‌ని పాత్ర ఫ‌న్నీగా ఉండ‌డంతో పాటు ఆస‌క్తిని క‌లిగించింది.

క్రైమ్ డ్రామా మూవీగా రూపొందిన నాచియర్ చిత్రం కి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగులో ఝాన్సీ పేరుతో ఆగ‌స్ట్ 17న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్‌లు కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్‌లపై సంయుక్తంగా రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్‌లో మంచి టాక్ తెచ్చుకోగా, తెలుగులోను ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

Related Stories: