బీజేపీని వీడిన జశ్వంత్‌సింగ్ కుమారుడు

బర్మార్: బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కుమారుడు, ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ నేడు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. రాజస్థాన్ బర్మార్ లో నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీలో చేరి తప్పుచేసినట్లు తెలిపారు. ఆత్మగౌరవం నినాదంతో మన్వేంద్ర సింగ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారని.. వారి డిమాండ్లు నెరవేరకపోవడంతో కోపంతో రగిలిపోతున్నారన్నారని పేర్కొన్నారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో జశ్వంత్ సింగ్‌కు బీజేపీ టికెట్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. ఇతర ఏ పార్టీలో చేరేది మన్వేంద్ర సింగ్ ఇంకా తెలపనప్పటికీ కాంగ్రెస్‌లో చేరడం లేదా స్వతంత్య్ర అభ్యర్థిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Related Stories: