మక్కాలో ఇక స్లీపింగ్ పాడ్స్

జపాన్‌లో స్థలాభావం వల్ల క్యాప్సూల్ హోటల్స్ వచ్చాయి. కేవలం ఓ మనిషి నడుం వాల్చేందుకు మాత్రమే అవి పనికొస్తాయి. అతితక్కువ సథలంలో ఎక్కువమందికి వసతి కల్పించడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు వీటిని మక్కాయాత్రికుల కోసం ప్రవేశపెట్టాలని సౌదీ ప్రభుత్వం యోచిస్తున్నది. ఏటా లక్షల మంది పవిత్రమక్కా యాత్రకు దేశదేశాలనుంచి వస్తుంటారు. వారందరికీ వసతి కల్పించడం కష్టసాధ్యమైన విషయం. అందుకే జపాన్ క్యాప్సూల్ తరహాలో స్లీప్ పాడ్స్ (కునుకు గూళ్లు) ఏర్పాటు చేయాలని తలపెట్టింది. వచ్చే మక్కాయాత్ర సీజన్‌లో కనీసం 20 లక్షల మంది మినా చేరుకుంటారు. ఈసారి వారికి కొత్తరకం బుల్లిగదుల హోటళ్లు సిద్ధంగా ఉంటాయి. ఓ సౌదీ చారిటబుల్ సంస్థ వీటిని ఏర్పాటు చేస్తున్నది. వీటిని ఉచితంగా లేదా నామమాత్రపు అద్దెకుగానీ ఇవ్వవచ్చంటున్నారు. ఫైబర్‌గ్లాసుతో తయారయ్యే ఈ పడకగదులు మూడు మీటర్ల పొడవు, మీటర్‌కు పైగా ఎత్తు ఉంటుంది. ఏసీతో పాటు శుభ్రమైన పరుపు మొదలైనవి ఉంటాయి. వీటిని ఎలా కావాలంటే అలా పేర్చుకోవచ్చు. ఇటీవల జరిపిన ట్రయల్ విజయవంతమైందని అధికారులు తెలిపారు.
× RELATED కొన్ని మీడియా సంస్థలకు కామన్ సెన్స్ లేదు