గానకోకిల వీడ్కోలు పలికింది

తాను ఎక్కడైతే ప్రస్థానం మొదలు పెట్టిందే అక్కడే ముగింపు పలికింది గాన కోకిల ఎస్ జానకి. దాదాపు 65 సంవత్సరాల పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, జర్మనీ, లాటిన్,జపనీస్, పంజాబీ ఇలా ఎన్నో భాషలలో దాదాపు 50,000 వరకు పాటలు పాడి అలరించింది. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాని చెప్పిన జానకమ్మ ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు చివరిసారిగా పాట పాడి ఆహుతులని అలరించారు. మైసూరులో జరిగిన తన చివరి సంగీత విభావరిని వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తొలిసారి 1952లో దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్ తో కలిసి మైసూరు నుంచే పాటలను పాడి తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది జానకి . నేపధ్యగాయనిగా ఎన్నో పాటలతో అలరించిన జానకమ్మ ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం, 31 సార్లు వివిధ రాష్ట్రాల పురస్కారాలు.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ గాయని ఎస్. జానకి గురించి చాలా విషయాలే ఉన్నాయి.అవార్డులకే అలంకారం ఆమె గాత్రం. ఒక కుగ్రామంలోని సాధారణ కుటుంబంలో పుట్టిన మహిళా అంతర్జాతీయ స్థాయిలో తన గాత్రానికి గుర్తింపు తెచ్చుకుందంటే అది తెలుగువారిగా మనందరికి గర్వకారణం. ది నైటెంగెల్‌ ఆఫ్‌ సౌత్ అని అభిమానులు సగర్వంగా పిలుచుకునే జానకమ్మ 1957లో తమిళ సినిమా విదియున్ విళయాట్టుతో గాయనిగా రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

Related Stories: