టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకులు..

జనగామ జల్లా: టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామ శివారు లాలుజోగ్యతండాకు చెందిన గ్రామ యువజన కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మహెష్ తో పాటు మరో పది మంది విద్యావంతులు టీఆర్ఎస్ లో చేరారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హైద్రాబాద్ లో వారికి గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ..స్వరాష్ట్రంలో అన్నివర్గాలకు అండగా నిలుస్తూ..తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు.

దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వానికి అండగా నిలిచి, గిరిజన తండాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యావంతులుగా తమవంతు కృషిచేబేందుకే టిఆర్ఎస్ లో చేరినట్లు మహేష్, అనిల్ కుమార్, నరేష్, రాజేష్, శ్రీకాంత్ తెలిపారు.

Related Stories: