అండర్సన్‌కు జరిమానా

లండన్: ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో ఫీల్డ్ అంపైర్ ధర్మసేన పట్ల దురుసుగా వ్యవహరించినందుకు అండర్సన్ మ్యాచ్ ఫీజులో 15శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. అండర్సన్ వేసిన 29వ ఓవర్లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని అంపైర్ ధర్మసేన తోసిపుచ్చాడు. ఔట్‌పై డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఇంగ్లండ్‌కు నిరాశే ఎదురైంది. తన క్యాప్, జంపర్‌ను తీసుకునే సమయంలో అండర్సన్ ధర్మసేనను దూషించాడు.