భారత్ ఖాతా తెరవకుండానే..

లండన్: రెండో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమ్‌ఇండియాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మురళీ విజయ్ వికెట్‌ను చేజార్చుకుంది. వరల్డ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన అద్భుత బంతికి విజయ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఓవర్ నాలుగు బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్న విజయ్.. అదే ఓవర్లో ఆండర్సన్ ఔట్‌స్వింగర్‌తో విజయ్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా కూడా తెరకుండానే తొలి వికెట్ నష్టపోయింది.

ఏడో ఓవర్లో ఆండర్సన్ తెలివైన బంతితో మరో ఓపెనర్ రాహుల్‌(8)ను కూడా పెవిలియన్ పంపి దెబ్బకొట్టాడు. రెండు ఫోర్లు కొట్టి ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నట్లే కనిపించిన రాహుల్ కీపర్ బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. దీంతో పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(1) క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్‌లో పుజారా(1) బ్యాటింగ్ చేస్తున్నాడు. 6.3 ఓవర్లకు భారత్ స్కోరు 11/2. శుక్రవారం ఆట ఆరంభంలోనే వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

Related Stories: