బస్సు ప్రమాదం షాక్‌కు గురిచేసింది : ప్రధాని

న్యూఢిల్లీ: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం తనను షాక్‌కు గురిచేసిందని, ప్రమాదంపై మాట్లాడేందుకు మాటలు రావట్లేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు.

బస్సు ప్రమాదంలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతో కలచివేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. బస్సు ప్రమాదం పట్ల మంత్రి హరీశ్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Related Stories: