ఓటర్ల నమోదు కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలి

సూర్యపేట నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల శంఖారావాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పూరించారు. సాయంత్రం స్థానిక త్రివేణి ఫంక్షన్ హల్లో నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎన్నికల దిశా,దశలను మంత్రి నిర్దేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం అదేశానుసారం జరుగుతున్న కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు ముందుండాలి. ఈ నెల 15,16 తేదీలలో బూత్ వారిగా ఓటర్ల నమోదు ప్రక్రియ ఉంటుంది. అందుకు గాను నియోజకవర్గ స్థాయిలోను బూత్ వారిగా 10 మంది సభ్యులతో బూత్ కమిటీల ఏర్పాటు చేస్తున్నాం. సూర్యపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న 243 బూత్‌లకుగాను 2,430 మందితో ఏర్పాటు చేసిన బూత్ కమిటీలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల నమోదు వివరాలను సేకరించే విదంగా ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇప్పటికి నమోదు అయిన మొత్తం లక్షా 94 వేలపై చిలుకు ఓటర్లను 900 మంది ఓటర్లకు ఒక బూత్ కమిటీ కలిసి టీఆర్ఎస్ విజయాలను వివరించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ....వారిని బూత్ కమిటీలు సన్నద్ధం చెయ్యాలాని పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన 243 బూత్ కమిటీలతో వేరు వేరుగా స్వయంగా బూత్‌ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మండలాల వారిగా సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీల ఆలోచనలను తలదన్నేలా గడిచిన నాలుగు సంవత్సారాల టీఆర్ఎస్ పాలన సాగింది. ఎన్నికూటమిలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకోలేదు దోషులెవ్వరు చట్టం నుండి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
× RELATED నామినేషన్ల చివరి రోజు కూటమి పార్టీలకు కాంగ్రెస్ షాక్