కేరళకు సల్మాన్‌ఖాన్ 12 కోట్లు ఇచ్చాడా?

కేరళలో వరదలు వచ్చినప్పటి నుంచి విరాళాల గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఎంతోమంది ప్రముఖులు కేరళకు భారీగా విరాళాలు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్‌లు చేశారు. అయితే వీటిలో కొన్ని నిజం కాగా.. మరికొన్ని ఎవరో సృష్టించినవి. ఇలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కూడా కేరళకు రూ.12 కోట్లు విరాళంగా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని నటుడు జావెద్ జాఫ్రీయే ట్వీట్ చేయడంతో చాలా మంది నిజమే అని నమ్మారు. అయితే కొందరు మాత్రం జావెద్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులో నిజం లేదని చెప్పడంతో జావెద్ జాఫ్రీ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. సల్మాన్ 12 కోట్లు ఇచ్చాడని తాను ఎక్కడో విన్నానని, అయితే ఆ విషయం ధృవీకరించుకోవాల్సి ఉందని మరో ట్వీట్ చేశాడు. అయితే దీనిపై ఇప్పటివరకు సల్మాన్‌ఖాన్ మాత్రం స్పందించలేదు.

అయితే సల్మాన్ సంగతి పక్కనపెడితే పలువురు ఇతర బాలీవుడ్ ప్రముఖులు మాత్రం కేరళకు భారీగానే విరాళాలు ఇచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోటి, కునాల్ కపూర్ రూ.1.2 కోట్లు ఇచ్చారు. ఇక అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్, కంగనా రనౌత్, సన్నీ లియోన్, అనుష్క శర్మ, రజనీకాంత్‌లాంటి వాళ్లు కూడా విరాళాలు ఇచ్చారు.

× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి