జెట్‌ఎయిర్‌వేస్ లో ఐటీ శాఖ తనిఖీలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అకౌంట్లలో అవకతవకలు, అనుమానాస్పద లావాదేవీలున్నట్టు ఆరోపణల నేపథ్యంలో జెట్‌ఎయిర్‌వేస్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్‌పై ఇప్పటికే సెబీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు విచారణ చేపట్టాయి. ముంబై ప్రధాన కార్యాలయంతో సహా నాలుగు జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో రెండు కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ఈ విషయాన్ని జెట్ ఎయిర్ వేస్ అధికారులు కూడా నిర్ధారించారు.కార్పొరేట్ వ్యవహారాల శాఖ గత నెలలో రికార్డులను తనిఖీ చేసింది. కాగా, ఈ తనిఖీల నేపథ్యంలో జెట్ ఎయిర్‌వేస్ షేరు ధర స్టాక్ మార్కెట్‌లో నాలుగు శాతం మేర నష్టపోయింది. పీవీ విక్రయాల్లో సుజుకీ హవా