యువతకు సందేశం!

అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్టంగా. సంపత్ వి.రుద్ర దర్శకుడు. ఎ.వి.ఆర్ మూవీస్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్. నేటి జనరేషన్ ప్రేమకు ఎలాంటి ప్రాముఖ్యతనివ్వాలనే కథాంశంలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మంచి సందేశంతో పాటు యువత నచ్చే అంశాలన్నీ వుంటాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేశ్వర్ నెమిలికొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచనా సహకారం: చిట్టిశర్మ, ఛాయాగ్రహణం: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహావీర్, ఎడిటింగ్: బొంతల నాఘేవ్వరరెడ్డి, మాటలు: శ్రీనాథ్ బాదినేని, పాటలు: చంద్రబోస్, కందికొండ.