ఇషా-ఆనంద్ నిశ్చితార్థం నేడు!

ముంబై, సెప్టెంబర్ 20: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, మరో బిజినెస్ టైకూన్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ నిశ్చితార్థం శుక్రవారం ఇటలీలోని లేక్ కోమోలో జరుగనున్నట్లు తెలుస్తున్నది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులతోపాటు ముకేశ్ అంబానీకి చెందిన దగ్గరి బంధువులు హాజరుకానున్నారు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దేవాలయంలో ఇషాకు ఆనంద్ తొలిసారిగా తన ప్రేమను తెలియజేశారు. ఆ తర్వాత మేలో ఇరు కుటుంభ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఒక కార్యక్రమం జరిగింది. డిసెంబర్‌లో వీరిద్దరి వివాహాం జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఇషా సోదరుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల నిశ్చితార్థం జూన్‌లో జరిగిన విషయం తెలిసిందే.