అవునా.. రణ్‌వీర్ తన అరచేతిలోని మెహందీలో దీపిక పేరు ఉందా?

అబ్బ.. ఈ సోషల్ మీడియా ఉంది చూశారూ.. సెలబ్రిటీలు దగ్గినా ఉలిక్కిపడుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దీప్‌వీర్ గురించే కదా చర్చ. వాళ్ల పెళ్లి అయిపోయింది. కొత్త జంట ఇవాళ ముంబైలో అడుగుపెట్టింది. దీంతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దీప్‌వీర్ అభిమానులు కొత్త జంటను చూడటానికి పోటెత్తారు. ఈసందర్భంగా పపరాజీకి పోజులిచ్చారు దీప్‌వీర్. అభిమానులకు చేయి ఊపారు. అప్పుడే ఓ విషయం బయటపడింది. రణ్‌వీర్ తన కుడి అరచేతిలో వేసుకున్న మెహందీ కనిపించింది. ఆయన అరచేయి మీద దీపిక పేరు రాసి ఉన్నట్టు పపరాజీకి కనిపించడంతో రణ్‌వీర్ చేతులను వాళ్లు క్లిక్‌మనిపించారు. అరచేయిని జూమ్ చేసి చూడగా.. మెహందీతో దియా వేసినట్టు ఉంది. దియా అంటే దీపం పెట్టే ప్రమిద. దాని కింద దీపిక పేరు ఉన్నట్టు దీప్‌వీర్ అభిమానులు చెబుతున్నారు. రణ్‌వీర్‌కు దీపిక అంటే ఎంత ప్రాణం.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. పోనీ.. రణ్‌వీర్ అరచేతిలో మీకేమైనా కనిపించిందా?

Related Stories: