మహేశ్ సినిమాకు నో చెప్పిన శ్రీదేవి కూతురు!

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మహేశ్‌బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినా..ఆ అరుదైన ఛాన్స్‌ను చేజార్చుకుందట ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ. బోనీకపూర్, శ్రీదేవి దంపతులు ఇప్పటికే జాన్వీని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో..మహేశ్ సినిమాతో హీరోయిన్‌గా జాన్వీ ఎంట్రీ ఇస్తే బావుంటుందని మురుగదాస్ శ్రీదేవికి సూచించారట. అయితే మహేశ్ సినిమాకు శ్రీదేవి ఓకే చెప్పినా జాన్వీ మాత్రం నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తర్వాతే ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. జాన్వీ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లోని ప్రతిష్టాత్మక థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో డ్యాన్స్, నటనలో శిక్షణ తీసుకుంటోంది.
× RELATED కృత్రిమ వర్షంతో ఢిల్లీలో వాయు కాలుష్యానికి చెక్!