శ్రీవారి సన్నిధిలో ఐపీఎల్ ట్రోఫీ

చెన్నై: ఐపీఎల్‌ను ముచ్చటగా మూడోసారి గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. టీమ్ చెన్నై వచ్చిన తర్వాత మేనేజ్‌మెంట్ ఐపీఎల్ ట్రోఫీని టీ నగర్‌లోని టీటీడీ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది చెన్నై. ఓపెనర్ వాట్సన్ కేవలం 57 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై 179 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.

Related Stories: